Thursday 21st November 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > జమ్మూ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం..హాజరైన రాహుల్ గాంధీ

జమ్మూ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం..హాజరైన రాహుల్ గాంధీ

Omar Abdullah Sworn In As Jammu Chief Minister | జమ్మూకశ్మీర్ ( Jammu Kashmir ) నూతన ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ( Omar Abdullah ) ప్రమాణం చేశారు.

ఇటీవల వెలువడిన జమ్మూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్సీ ( National Conference ), కాంగ్రెస్ ( Congress ) కూటమి స్పష్టమైన మెజారిటీని సాధించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ( Manoj Sinha ) కు విజ్ఞప్తి చేశారు.

ఈ క్రమంలో బుధవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన ఆహ్వానించారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా రద్దు చేసి, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు.

అలాగే డిప్యూటీ సీఎంగా సురిందర్ కుమార్ చౌదరి ప్రమాణం చేశారు. శ్రీనగర్ లోని షెరి కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ( Mallikharjun Kharge ) , ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ), ప్రియాంక గాంధీ హాజరయ్యారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతానికి తాము ప్రభుత్వంలో చేరడం లేదని, బయటి నుండే మద్దతు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది.

You may also like
నన్ను కాపాడండి..ప్రాణాలు పోతున్నాయన్నా చలించని మనుషులు
అఖండ భారతంలో అదానీకో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా
అదానీకి అరెస్ట్ వారెంట్.. ఛార్జిషీట్ లో మోదీ పేరు చేర్చాలి
వలలో చిక్కిన చిరుత..వండుకుని తినేసిన వేటగాళ్ళు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions