‘OG’ Collections | డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో అభిమానులకు పూనకలు తెప్పిస్తున్న సినిమా ‘ఓజి’. గురువారం విడుదల అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో థియేటర్ల వద్ద సందడి చేస్తుంది.
కాగా తొలిరోజు ‘ఓజి’ అదిరిపోయే కలెక్షన్లను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే తొలిరోజు అత్యధికంగా వసూలు చేసిన మూవీగా నిలిచింది. అలాగే ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్ 10 సినిమాల్లో ఓజి నిలవడం విశేషం. గురువారం ఒక్కరోజే ‘ఓజి’ రూ.154 కోట్లను వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ డీవివి ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది.
‘ఇది పవన్ కళ్యాణ్ సినిమా..చరిత్రను తిరగరాస్తుంది’ అని సంస్థ పేర్కొంది.ఇకపోతే ఓవర్సీస్ లో కేవలం ప్రీమియర్స్ ద్వారానే ఓజి మూడు మిలియన్ డాలర్ల కంటే అధికంగా వసూలు చేసిన విషయం తెల్సిందే.









