NTR Neel Movie Update | ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (NTRNeel) కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఎన్టీఆర్ నీల్ సినిమాకు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ ఓ కీలక అప్డేట్ విడుదల చేసింది. ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలిపింది. సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు పేర్కొంది.
సినిమాలో భారీస్థాయిలో యాక్షన్ సీన్స్ ఉంటాయని వెల్లడించింది. పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కునున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడీగా రుక్మిణీ వసంత్ నటించనున్నారు.
మాలీవుడ్ యంగ్ హీరో టొవినో థామస్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. 2026 జనవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.