Newly married couple suicide in Jagtial | జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్ళైన నెల రోజుల వ్యవధిలోనే ప్రేమించి వివాహం చేసుకున్న నవ దంపతులు బలన్మరణానికి పాల్పడ్డారు.
దసరా పండుగ రోజు భర్త మందలించడాని తీవ్ర మనస్తాపానికి గురైన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాజగా దీపావళి పండుగ నాడు భార్య ఆత్మహత్య నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన భర్త కూడా బలన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే ఎర్దండి గ్రామానికి చెందిన సంతోష్ మరియు గంగోత్రి సుమారు నాలుగేళ్ళ పాటు ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. దసరా పండగ నేపథ్యంలో సంతోష్ భార్యతో కలిసి అత్తింటికి వెళ్ళాడు.
భోజనం చేసే సమయంలో మటన్ కూరలో కారం ఎక్కువైందని భర్త మందలించాడు. దింతో తీవ్ర మనస్తాపానికి గురైన గంగోత్రి క్షణికావేశంలో అదే రోజు రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య మృతితో సంతోష్ మనోవేదనకు గురయ్యాడు. ఇటీవలే ఆదిలాబాద్ లో ఉండే అక్క ఇంటికి వెళ్ళాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని అతడు కూడా బలన్మరణానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.









