Nara Lokesh News | మంత్రి నారా లోకేష్ ఆదివారం సొంత నియోజకవర్గం మంగళగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నియోజకవర్గంలోని పేదలకు రూ.వెయ్యి కోట్ల విలువైన భూములు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అత్యాధునిక వసతులతో ఏడాదిలోగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ ఆసక్తికరమైన పోస్టును చేసింది. తాత ఎన్టీఆర్ కల..మనవడు లోకేష్ నెరవేర్చాడని పేర్కొంది. మంగళగిరి ప్రజల 3 దశాబ్దాల కల, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి లోకేష్ శంకుస్థాపన చేశారని తెలిపింది.
40 ఏళ్ల క్రితం 30 పడకల ఆసుపత్రికి తాత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శంకుస్థాపన చేయగా, ఇన్నేళ్ల తర్వాత వంద పడకలుగా అప్ గ్రేడ్ చేసే ఆసుపత్రికి మనవడు నారా లోకేష్ శంకుస్థాపన చేయడంతో ఈ ప్రాంతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ పోస్ట్ చేసింది.