Nara Lokesh Meets Tony Blair | ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు.
ఇదే సమయంలో గురువారం ఉదయం బ్రిటన్ మాజీ ప్రధాని, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్(టిబిఐ) వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్ తో నారా లోలేసాజ్7 సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఎఐ టూల్స్ ను వినియోగించడానికి టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్(టిబిఐ) ద్వారా సహకరించేందుకు టోనీ బ్లెయిర్ గతంలో అంగీకరించారు. ఆ మేరకు రాష్ట్రంలో అమలుచేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టిబిఐ సాంకేతిక మద్దతుపై ఇరువురూ చర్చించారు.
ఈ సందర్భంగా గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (GiGG) సలహాబోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లెయిర్ ను మంత్రి ఆహ్వానించారు. నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరింది.
ఆగస్టులో విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్ కు TBI భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లెయిర్ చెప్పారు.










