Thursday 24th April 2025
12:07:03 PM
Home > తాజా > కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైంది..ఎస్పీకి దండం పెట్టిన జీవన్ రెడ్డి

కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైంది..ఎస్పీకి దండం పెట్టిన జీవన్ రెడ్డి

Murder Of Congress Leader In Jagityal | జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ( MLC Jeevan Reddy ) అనుచరుడి హత్య జరగడం సంచలనంగా మారింది. జాబితాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకుడు గంగిరెడ్డి ( Gangireddy )హత్య జరిగింది.

ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గంగిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సంతోష్ అనే వ్యక్తి ఈ హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ క్రమంలో మృతికి నిరసనగా జగిత్యాల ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించి జీవన్ రెడ్డి నిరసన చేపట్టారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ ( Demand ) చేశారు. తన తమ్ముడి లాంటి వ్యక్తిని దారుణంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో పోలీసుల తీరుపై జీవన్ రెడ్డి సీరియస్ అయ్యారు. జగిత్యాలలో బీఆరెస్ ( BRS ) రాజ్యం నడుస్తుందా అని ప్రశ్నించారు. నిరసనని విరమించాలని ఎస్పీ అశోక్ కుమార్ కోరారు.

జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులకు రక్షణ లేకుండా పోయిందని జీవన్ రెడ్డి ఎస్పీ ( SP )కి దండం పెట్టారు. కాంగ్రెస్ పాలనలో మాకే రక్షణ లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు.

You may also like
‘ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా వదిలేదే లేదు’
‘ఐఎన్ఎస్ సూరత్ సీ స్కిమ్మింగ్’
‘మోదీజీ ఈ లాఠీ తీసుకోండి..ప్రధానిపై షర్మిల ఫైర్’
‘పాక్ ప్రధానిపై నిప్పులుచేరిగిన ఆ దేశ మాజీ క్రికెటర్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions