Mumbai on high alert after ‘Lashkar-e-Jihadi’ claims 34 bombs | ‘లష్కర్ ఏ జిహాదీ’ అనే ఖాతా నుంచి ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది.
శుక్రవారం ఈ మెయిల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వినాయక చవితి నేపథ్యంలో విగ్రహ నిమర్జన కార్యక్రమం ముంబయిలో అట్టహాసంగా జరుగుతుంది. ఈ తరుణంలో బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో నగరంలో హైఅలెర్ట్ ప్రకటించారు.
పాకిస్థాన్ కు చెందిన జిహాదీ సభ్యునిగా పేర్కొన్న ఓ వ్యక్తి ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు మెయిల్ పంపాడు. నగరంలోకి 14 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు చొరబడినట్లు తెలిపాడు. 400 కిలోల ఆర్డీఎక్స్ తి నగరంలోని పలు ప్రాంతాల్లో 34 వాహనాల్లో మానవ బాంబులను ఏర్పాటు చేసినట్లు జిహాదీ గ్రూప్ సభ్యుడు మెయిల్ లో పేర్కొన్నాడు.
బాంబు పేలుళ్లతో ముంబయి నగరం అల్లకల్లోలం అవుతుందని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ముంబయిలో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా తనికీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అనుమానాస్పద కదలికలను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.










