Mrunal Thakur | ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) పై ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)తో ఆమె రిలేషన్ షిప్ లో ఉందనీ, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో రూమర్లు వైరల్ అయ్యాయి.
తాజాగా ఆ రూమర్లపై మృణాల్ ఠాకూర్ స్పందించారు. ఆ డేటింగ్ రూమర్లకు నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇలాంటి పుకార్లను తాను ఫ్రీ పీఆర్ భావిస్తానంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. మృణాల్ తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో ఒక వీడియోను షేర్ చేశారు.
అందులో ఆమె తలకు నూనె పెట్టిస్తుండగా గట్టిగా నవ్వుతూ కనిపించారు. ఈ వీడియోకు, “వాళ్ళు మాట్లాడుకుంటారు… మనం నవ్వుకుంటాం. రూమర్లు అంటే ఫ్రీ పీఆర్. నాకు ఉచితంగా వచ్చేవి ఇష్టం” అంటూ ఓ క్యాప్షన్ జోడించారు.
అయితే ఈ పోస్ట్ ధనుష్ తో పెళ్లిపై వచ్చిన రూమర్ల గురించే అయ్యుంటుందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కాగా, మృణాల్ ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి ‘హై జవాని తో ఇష్క్ హోనా హై’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఒక రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కుతోంది.









