MLC Kavitha On KTR’s E-Car Case | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) పై ఏసీబీ ఎఫ్ఐఆర్ ( FIR ) నమోదు చేసిన విషయం తెల్సిందే.
ఫార్ములా ఈ కార్ రేస్ ( Formula E Car Race ) వ్యవహారానికి సంబంధించి పీసీ యాక్ట్ ( Prevention Of Corruption Act ) కింద కేటీఆర్ పై కేసు నమోదైంది. కాగా కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు.
రాజకీయంగా ఎదుర్కోలేక బీఆరెస్ మరియు పార్టీ అధినేత కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని న్యాయపరమైన ఎత్తుగడలు వేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని కవిత పేర్కొన్నారు. అసెంబ్లీలో చర్చకు ధైర్యం చేయని ముఖ్యమంత్రి రేవంత్, తప్పుడు కేసులతో కేటీఆర్ ను భయపెట్టాలని చూస్తున్నట్లు తెలిపారు.
‘ముఖ్యమంత్రి గారు మేము కేసీఆర్ సైనికులం. తెలంగాణ ఉద్యమం నుండి ఎదిగాం. మీ చిన్నపాటి వ్యూహాలు మమ్మల్ని భయపెట్టవు’ అంటూ కవిత స్పష్టం చేశారు. రాజకీయంగా పోరాడుతామని ఆమె వెల్లడించారు.