Monday 12th May 2025
12:07:03 PM
Home > తాజా > అగ్గిపెట్ట దొరకని హరీష్ ఆగమాగం అవుతుండు: సీతక్క సెటైర్లు!

అగ్గిపెట్ట దొరకని హరీష్ ఆగమాగం అవుతుండు: సీతక్క సెటైర్లు!

mla seethakka

Seethakka Satires On HarishRao | ములుగు కాంగ్రెస్ అభ్యర్ధి సీతక్క (Seethakka) సంచలన వ్యాఖ్యలు చేశారు.

నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ఈ మేరకు మాట్లాడుతూ తాను మంత్రిని అవుతా అంటే హరీష్ రావు (Harish Rao) ఎద్దేవా చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అగ్గిపెట్ట దొరకని హరీష్ ఆగం ఆగంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ఆమె. ఒక బడుగుబలహీన వర్గాలకు చెందిన మహిళ మంత్రి అవుతుందంటే బీఆరెస్ నేతలకు గిట్టడం లేదని విమర్శించారు.

ఏ నేను మంత్రిని కావొద్దా, నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవొద్దా అంటూ ప్రశ్నించారు.

Read Also: కేసీఆర్ కు రూ.1.06 కోట్లు అప్పిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి!

సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రులు హరీష్, కేటీఆర్ లు తనపై కుట్ర పన్ని రూ.200 కోట్లతో తనను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు సీతక్క.

అలాగే గ్రామాలల్లో కల్తీ మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారని ఫైర్ అయ్యారు. ములుగులో తన పోటీ నాగజ్యోతి తో కాదని కేసీఆర్ మరియు కేటీఆర్ (KTR)లతో అంటూ వ్యాఖ్యానించారు.

బీఆరెస్ (BRS) వాళ్ళు డబ్బులను నమ్ముకుంటే, తాను మాత్రం ప్రజలనే నమ్ముకున్నట్లు స్పష్టం చేశారు. దొరల పాలన కావాలా లేక ప్రజల వద్దకే పాలన కావాలా నిర్ణయించుకోవాలి కోరారు సీతక్క.

You may also like
blackberry island
ఇది అమేజాన్ అడవి కాదు.. మా ములుగు: మంత్రి సీతక్క!
harish rao
ఇది 8 పర్సెంట్ గవర్నమెంట్.. హరీశ్ రావు విమర్శలు!
harish rao
హస్తం తీసేసి ఆ గుర్తు పెట్టుకోండి.. కాంగ్రెస్ పై హరీశ్ రావు హాట్ కామెంట్స్!
harish and revanth
‘నాడు ఫ్రీ అని నేడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions