Monday 19th May 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పాకిస్తాన్ లో మార్నింగ్ వాక్ చేసిన కేంద్రమంత్రి జై శంకర్

పాకిస్తాన్ లో మార్నింగ్ వాక్ చేసిన కేంద్రమంత్రి జై శంకర్

Minister Jaishankar In Pakistan | పాకిస్తాన్ దేశంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ మార్నింగ్ వాక్ ( Morning Walk ) చేశారు.

షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు మంత్రి జై శంకర్ మంగళవారం పాకిస్తాన్ వెళ్లారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం పాక్ లోని భారత హైకమీషన్ లో ఉన్న సిబ్బందితో కేంద్రమంత్రి మార్నింగ్ వాక్ చేశారు.

దీనికి సంబంధించిన ఫోటోను ఎక్స్ వేదికగా షేర్ చేసి, పాక్ లో టీం ఇండియా ( Team India )తో మార్నింగ్ వాక్ అని కాప్షన్ ( Caption ) ఇచ్చారు. అలాగే అమ్మ పేరు మీద ఒక మొక్కను నాటండి అని ప్రధాని మోదీ ( Pm Modi )పిలుపు మేరకు కేంద్రమంత్రి జై శంకర్ పాక్ లో అర్జున మొక్కను నాటారు.

ఇదిలా ఉండగా మంగళవారం పాక్ రాజధాని ఇస్లామాబాద్ ( Islamabad ) చేరుకున్న కేంద్రమంత్రికి ఆ దేశ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఎస్ఓసి సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సభ్యదేశాలు ప్రతినిధులకు ఆ దేశ ప్రధాని షేహ్ బాజ్ షరీఫ్ మంగళవారం రాత్రి విందు ఇచ్చారు.

You may also like
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’
పురుషులపై ఆసక్తి లేదు..పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions