Mettu Sai Kumar Suggests KTR and Harish Rao for Bigg Boss Season 10 | బిల్లా, రంగా లుగా పేరొందిన బీఆరెస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులను బిగ్‌బాస్ లోకి తీసుకోవాలని కోరారు కాంగ్రెస్ నేత, ఫిషరీస్ కార్పోరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్. ఈ మేరకు బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జునకు లేఖ రాశారు. షో టీఆర్పీ పెంచుకోవాలంటే కేటీఆర్, హరీష్ లకు అవకాశం ఇవ్వాలన్నారు.
‘ఇప్పటికే వీరిద్దరూ రాజకీయ నటులుగా పేరుప్రఖ్యాతలు సాధించారు. అబద్దాలు చెప్పడంలో రికార్డులను బద్దలుకొట్టారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి, గిన్నిస్ బుక్ లకెక్కారు. నటనకే నాట్యం నేర్పిన వారు.. నవరసాలు పండించడంలో వీరికి వీరే సాటి. ఆస్కార్ను సైతం ఆశ్చర్య పరిచే నటన వీరిది. తెలంగాణ ప్రజల ను మోసం చేసిన పాపం వీరి సొంతం. ఇలాంటి చక్కటి నటులను బిగ్ బాస్ సీజన్ 10లో అవకాశం ఇస్తే.. తెలంగాణ ప్రజలతోపాటు యావత్ దేశ ప్రజలకు మంచి ఎంటర్ టైన్మెంట్ దొరుకుద్ది. మీ టీఆర్పీ రెట్టింగ్స్ కూడా అమాంతం పెరుగుతాయి’ అని ఆయన ఎద్దేవా చేశారు.









