Saidharam tej in controversy
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నిన్న శ్రీకాళహస్థిలో చేసిన పనికి వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన ‘బ్రో’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.
ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించాడు. విడుదల నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్లు మొదలుపెట్టింది.
అందులో భాగంగా హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తిలో పర్యటించారు. అక్కడ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజ కార్యక్రమాల సంధర్బంగా హీరో సాయిధరమ్ తేజ్ స్వయంగా సుబ్రహ్మణ్యస్వామికి హారతి ఇచ్చారు.
ఇక్కడే వివాదం రాజుకుంది. ఆలయ నియమాల ప్రకారం స్వామివారికి కేవలం ఆలయ అర్చకులు మాత్రమే హారతి ఇవ్వాలి.
అలాంటి నియమాలు ఉన్న దేవాలయంలో సాయిధరమ్ తేజ్ తన చేతుల మీదుగా హారిత ఇవ్వడం పట్ల భక్తులు మండిపడుతున్నారు. కేవలం అర్చకులు మాత్రమే హారతి ఇవ్వాలని,భక్తులు ఇలా హారతి ఇవ్వడం ఏంటని? వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ వివాదంపై హీరో సాయిధరమ్ తేజ్ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది.