Friday 11th July 2025
12:07:03 PM
Home > తెలంగాణ > కేటీఆర్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ..

కేటీఆర్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ..

కేటీఆర్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ..
  • బీఆర్ఎస్ కార్యాలయంలో భేటీ అయిన కేటీఆర్
  • ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై విశ్లేషణ
  • మాజీ మంత్రులు, కీలక నేతలు, ఎమ్మెల్సీ కవిత కూడా హాజరు
  • ఆ తర్వాత ఫామ్ హౌస్‌కు బయలుదేరిన నేతలు

హైదరాబాద్ :పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, పలువురు కీలక నేతలు, ఎమ్మెల్సీ కవిత తదితరులు హాజరయ్యారు. వీరు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను వారు విశ్లేషించారు. అలాగే ఓడిపోయిన నియోజకవర్గాల్లోని పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ హ్యాట్రిక్‌పై కన్నేసింది. కానీ అనూహ్యంగా పరాజయంపాలైంది. ఈ నేపథ్యంలో పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు కేటీఆర్.. ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. భేటీ అనంతరం ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అందరూ కేసీఆర్ ఫామ్ హౌస్‌కు బయలుదేరారు.

You may also like
కర్ణాటక చిన్నారికి తెలంగాణ మంత్రి చేయూత
రిటైర్మెంట్ వయసుపై ఆరెస్సెస్ చీఫ్ వ్యాఖ్యలు..మోదీ గురించేనా?
‘తెలంగాణ వచ్చి దశాబ్ధం దాటినా..యువకుల ఆత్మహత్యలు ఆగడం లేదు’
‘అన్యమతస్థులను తొలగించండి..టీటీడీకి బండి విజ్ఞప్తి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions