Saturday 14th February 2026
12:07:03 PM
Home > తాజా > ‘ తాతా వచ్చాడే ‘..మనవరాలి పెళ్లిలో మాస్ స్టెప్పులేసిన మల్లారెడ్డి

‘ తాతా వచ్చాడే ‘..మనవరాలి పెళ్లిలో మాస్ స్టెప్పులేసిన మల్లారెడ్డి

Mallareddy Viral Dance Video | తెలంగాణ ( Telangana ) రాజకీయాల్లో ఆయనో మాస్ పొలిటీషియన్ ( Politician ). ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సినిమా డైలాగులు, పొలిటికల్ ఛాలెంజులు, తొడ కొట్టడాలు జరుగుతుంటాయి.

ఆయనే మాజీ మంత్రి మల్లారెడ్డి ( Mallareddy ). తాజాగా ఈ బీఆరెస్ ఎమ్మెల్యేకు సంబంధించిన పలు వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ ( Viral ) గా మారాయి. 71 ఏళ్ల వయసులో కూడా యువకులకు ధీటుగా మల్లారెడ్డి మాస్ స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ( Malkajgiri ) ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ( Marri Rajashekar Reddy ) కూతరు శ్రేయారెడ్డి, ఆదిత్య ల వివాహం అక్టోబర్ 27న జరగనుంది. వివాహం లో భాగంగా ఇటీవల సంగీత్ జరిగింది. ఈ ఈవెంట్ లో మల్లారెడ్డి తెలుగు సినీ పాటలకు డాన్స్ వేశారు.

‘తాతా వస్తారే..అదరకొట్టి పోతాడే ‘ , ‘ నాటు నాటు ‘ , డీజే టిల్లు ( DJ Tillu ) పాటలకు మల్లారెడ్డి వేసిన స్టెప్పులు వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా తన మనవరాలి పెళ్లికి రావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth ), ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu ) లను మల్లారెడ్డి ఆహ్వానించారు.

You may also like
పాక్ క్రికెటర్ జీవితాన్ని మార్చేసిన ధోని
AI సమ్మిట్ కు బిల్ గేట్స్..సిగ్గుచేటన్న ఎంపీ!
ఓటు రూ.70 వేలు..ఆ అభ్యర్థి ఫలితం ఏంటంటే!
ఏపీ బడ్జెట్..పంచాయతీ రాజ్ శాఖకు ఎన్ని రూ.కోట్లంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions