Maha Vikas Aghadi On Election Results | మహారాష్ట్ర ( Maharastra ) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
మొత్తం 288 సీట్లున్న మహారాష్ట్రలో అధికార మహాయుతి ( Mahayuti ) కూటమి ఏకంగా 220కి పైగా స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ ( Congress ), శివసేన యూబీటీ ( Shivsena UBT ), ఎన్సీపీ శరద్ పవార్ ( NCP Sharad Pawar ) ల కూటమి మహా వికాస్ అఘాడీ కేవలం 50కి పైగా స్థానాల్లోనే లీడింగ్ లో ఉంది.
దీంతో వస్తున్న ఫలితాలపై అనుమానం వ్యక్తం చేశారు శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్. ఏదో గడ్ బడ్ జరుగుతుందని ఆయన ఆరోపించారు. తమ నుండి మహాయుతి కూటమి సీట్లను లాక్కుందని ధ్వజమెత్తారు.
ఎక్నాథ్ షిండే ( Eknath Shinde ), దేవేంద్ర ఫడ్నవీస్ ( Devendra Fadnavis ), ప్రధాని మోదీ ( PM Modi ) మహారాష్ట్ర ప్రజలకు ఎం చేశారు, ఇన్ని సీట్లు రావడానికి అంటూ ఆయన ప్రశ్నించారు. మరీ ముఖ్యంగా శివసేన షిండే 50కి పైగా, అజిత్ పవార్ ఎన్సీపీ 40కి పైగా స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుండడం పై ఆయన అనుమానం వ్యక్త పరిచారు. వస్తున్న ఫలితాలను ప్రజలు కూడా అంగీకరించరని పేర్కొన్నారు.