Saturday 5th April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > విశాఖ అగ్ని ప్రమాద ఘటనపై లోకల్ బాయ్ నాని కీలక వ్యాఖ్యలు!

విశాఖ అగ్ని ప్రమాద ఘటనపై లోకల్ బాయ్ నాని కీలక వ్యాఖ్యలు!

local boy nani

Local Boy Nani | ఇటీవల సంభవించిన విశాఖ హార్బర్ అగ్నిప్రమాదంపై హైకోర్టు ను ఆశ్రయించారు ప్రముఖ యూట్యూబర్ లోకల్ బాయ్ నాని (Local Boy Nani).

అనంతరం మీడియా తో మాట్లాడుతూ ఆ అగ్నిప్రమాదానికి తనకు ఏం సంబంధం లేదని స్పష్టం చేశారు.

అగ్నిప్రమాదం సంభవించిన  సమయంలో తాను ఒక హోటల్ లో ప్రైవేట్ కార్యక్రమంలో ఉన్నట్లు వివరణ ఇచ్చారు.

సమాచారం అందగానే హోటల్ నుండి విశాఖ హార్బర్ (Vizag Harbor) కు వెళ్లినట్లు, గంగపుత్రులకు సహాయం చేద్దామనే ఉద్దేశ్యంతోనే వీడియో చేసినట్లు పేర్కొన్నారు.

కానీ విచారణ పేరుతో తనను పోలీసులు పిలిచి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో నలుగురి అమాయకులను కూడా విచారణ పేరుతో పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు.

తన తోటి గంగపుత్రులకు హాని చేసే విదంగా తాను ఏమి చేయనని, ఈ విషయాన్ని అందరూ అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు.

తనకు ఏ పార్టీకి, ఏ నేతకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు లోకల్ బాయ్ నాని.

You may also like
ప్రధాని మోదీకి ‘శ్రీలంక మిత్ర విభూషణ’
స్టేడియంలో ఎంఎస్ ధోని తల్లిదండ్రులు..అందుకోసమేనా!
రూ.1కే ఒక జీబీ డేటా..BSNL మాస్టర్ స్ట్రోక్
అమెరికా ‘గోల్డ్ కార్డ్’..ఫస్ట్ లుక్ రిలీజ్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions