KTR News Latest | భర్త, కుమారుడి ఆధార్ కార్డుపై యూరియా బస్తాలు కొనుగోలు చేసినందుకు ఓ మహిళా రైతుపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి జైలుకు పంపించారని పేర్కొన్నారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఓ మహిళపై పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారని మండిపడ్డారు. ఒక ఆధార్ కార్డుపై ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా సంగెం మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు తన భర్త, కుమారుడి ఆధార్ కార్డుపై కూడా యూరియా బస్తాలు తీసుకుందని కానీ పోలీసులు మాత్రం ఆమెను జైల్లో వేశారని చెప్పారు.
ఒక యూరియా బస్తా తన పొలానికి సరిపోదు, దింతో ముంబయిలో పని చేసుకుంటున్న భర్త, హైదరాబాద్ ఉద్యోగం చేసుకుంటున్న కుమారుడి ఆధార్ కార్డుపై ఆమె మరో రెండు యూరియా బస్తాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ఆ వెంటనే పోలీసులు వచ్చి మహిళపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి, జైల్లో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వంలో యూరియా బస్తాలు తీసుకుంటే, ఏదో మర్డర్ చేసినట్టు మహిళా రైతులు అని కూడా చూడకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.









