Kolkata Doctor Rape-Murder Case | వెస్ట్ బెంగాల్ ( West Bengal ) రాజధాని కోల్కత్త లో జూనియర్ వైద్యురాలి పై జరిగిన హత్యాచార ( Kolkata Doctor Rape And Murder Case ) కేసును దేశ సర్వోన్నత న్యాయస్థానం ( Supreme Court ) సుమోటగా ( Suo Moto ) స్వీకరించి మంగళవారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వం, కోల్కత్త పోలీసులు మరియు కాలేజి అధికారుల తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ ఘటనలో మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ ( Principal ) దీన్ని ఆత్మహత్యగా సమాచారం అందించే ప్రయత్నం చేసారని ఆగ్రహం వ్యక్తం చేసింది డీవై చంద్రచుద్ ( DY Chandrachud )నేతృత్వంలోని ధర్మాసనం.
అలాగే మధ్యాహ్నం 1.45 నిమిషాల నుండి 4 గంటల వరకు శవపరీక్ష పూర్తి అయితే రాత్రి 11.45 నిమిషాలకు ఎఫ్ఐఆర్ ( FIR ) నమోదు చేయడం పట్ల సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అధికారులు, కోల్కత్త పోలీసులు అప్పటివరకు ఎం చేస్తున్నారని నిలదీశారు.
అంతేకాకుండా మృతదేహాన్ని చూపించేందుకు తల్లిదండ్రులు గంటల పాటు ఎదురుచూసేలా ఎందుకు చేసారని ధర్మాసనం ఘాటుగా ప్రశ్నించింది.