Kcr News| మాజీ సీఎం, బీఆరెస్ ( Brs ) సుప్రిమో కేసీఆర్ ( Kcr ) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు ఆదివారం తెలంగాణ భవన్ ( Telangana Bhavan ) లో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో ( Road Show ) లు నిర్వహించాలని తెలిపారు. అంతేకాకుండా స్వయంగా తాను కూడా పాల్గొంటానని చెప్పారు.
రానున్న లోక్సభ ( Loksabha ) ఎన్నికల్లో బీజేపీ ( Bjp ), బీఆరెస్ ( Brs ) మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్నారు.
మార్చి12న కరీంనగర్ ( Karimnagar ) లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే బస్సు యాత్రలు చేయాలని నేతలకు సూచించారు.