KBK Group Donates Notebooks | డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్ మెంట్ సహా వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న కేబీకే గ్రూప్ (KBK Group), లయన్స్ క్లబ్ హైదరాబాద్ డిజిప్రెన్యూర్ ఏఐ (Lions Club Digiprenuers AI Chapter) ఆధ్వర్యంలో ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ చేశారు.
కేబీకే గ్రూప్ చైర్మన్, లయన్స్ క్లబ్ డిజిప్రెన్యూర్ చాప్టర్ సెక్రెటరీ డాక్టర్ కక్కిరేణి భరత్ కుమార్ (Kakkireni Bharath Kumar) – జయ వైష్ణవి దంపతులు తమ కుమార్తె భవిశ్రీ క్షితిజ పుట్టిన తేదీ సందర్భంగా కేబీకే వెల్ఫేర్ అసోసియేషన్ (KBK Welfare Association) ద్వారా ప్రతి నెలా సేవాకార్యక్రమాలు చేపడుతుంటారు.
అందులో భాగంగా ఎల్బీ నగర్ మన్సూరాబాద్ లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ మనోహర్ రెడ్డి, లయన్స్ క్లబ్ డిజిప్రెన్యూర్ ఏఐ ప్రెసిడెంట్ నిఖిల్ గుండా, ఇంటర్నేషనల్ యోగా కోచ్ యోగ నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కేబీకే గ్రూప్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్న భరత్ కుమార్ ను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం భరత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిన సాధించే దిశగా నిత్యం కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు లయన్స్ క్లబ్, కేబీకే గ్రూప్ లకు కృతజ్ఞతలు తెలిపారు.









