Kavitha About Cm Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. హైదరాబాద్ కు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరుగుతుందని ఆమె ఆరోపించారు.
మేఘా కృష్ణారెడ్డితో కుమ్మక్కయ్యి అంచనా వ్యయం అమాంతం పెంచి కాంట్రాక్టును కట్టబెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.1500 కోట్లతో రూపకల్పన చేసిన ప్రాజెక్టును రేవంత్ రెడ్డి రూ.7360 కోట్లకు పెంచి మేఘా కంపెనీకి ధారాదత్తం చేశారని కవిత బాంబు పేల్చారు.
హైదరాబాద్ కు దగ్గర్లో ఉండే కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని తీసుకునే అవకాశం ఉన్నా మల్లన్న సాగర్ కు ప్రాజెక్టును ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు.









