Janwada Farmhouse News | జన్వాడ ఫార్మ్ హౌస్ ( Janwada Farmhouse ) వద్దకు మంగళవారం ఇరిగేషన్ అధికారులు వెళ్లడం సంచలనంగా మారింది.
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ ఫార్మ్ హౌస్ వద్దకు ఇరిగేషన్ అధికారులు చేరుకుని కొలతలు వేస్తున్నారు. కాగా చెరువు ఎఫ్టీఎల్ ( FTL ) పరిధిలో ఫార్మ్ హౌస్ నిర్మాణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
అలాగే ఈ ఫార్మ్ హౌస్ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) దేనని పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
కానీ జన్వాడ ఫార్మ్ హౌస్ తనది కాదని, లీజ్ కు తీసుకొని అందులో ఉంటున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, తాజాగా అధికారులు ఫార్మ్ హౌస్ వద్దకు చేరుకోవడం సంచలనంగా మారింది. ప్రస్తుతం కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు.