Jailed ex-MP Prajwal Revanna to serve as library clerk, to get daily pay of Rs. 522 | దేశ మాజీ ప్రధాన హెచ్డీ దేవ గౌడ మనవడు, హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు అత్యాచార కేసుకు సంబంధించి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న విషయం తెల్సిందే.
బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. కాగా జైలు నిబంధనల ప్రకారం జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలు ఏదో ఒక రకమైన పని చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణకు జైలు అధికారులు లైబ్రరీ క్లర్క్ గా పని కేటాయించారు.
జైలులోని లైబ్రరీలో తోటి ఖైదీలకు పుస్తకాలు జారీ చేయడం, పుస్తకాలకు సంబంధించిన వివరాలను నమోదు చేయడం మరియు రికార్డులను నిర్వహించడం వంటిని ప్రజ్వల్ విధులు. ఈ పని కోసం ఆయనకు రోజుకు రూ.522 వేతనం చెల్లిస్తారు. జైలు నిబంధనల ప్రకారం జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలు నెలకు కనీసం 12 రోజులు, వారానికి మూడు రోజుల పాటు పని చేయాల్సి ఉంటుంది.









