IPL tickets get costlier with 40% GST | ఢిల్లీలో జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై జీఎస్టీలో 5, 18% శాతం స్లాబులు మాత్రమే కొనసాగనున్నాయి.
12, 28% స్లాబులను కేంద్రం తొలగించనుంది. అలాగే లగ్జరీ వస్తువులపై మాత్రం 40 శాతం జీఎస్టీ వర్తించనుంది. దింతో రేసు క్లబ్బులు, లీజింగ్, రెంటల్, గుర్రపు పందాలు, ఆన్లైన్ గేమ్స్, లాటరీ, క్యాసినో వంటివాటిపై 40 శాతం పన్ను పడనుంది.
ప్రీమియం క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ టికెట్ ధరలు సైతం ఈ జాబితాలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచుల టికెట్ రేట్లు పెరగనున్నాయి. ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచుల టికెట్లపై 28 శాతం జీఎస్టీ ఉండగా, ఇప్పుడు అదనంగా మరో 12 శాతం చెల్లించాల్సి ఉంటుంది.
నూతన స్లాబులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. దింతో వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ లీగ్ లో మ్యాచుల టికెట్ రేట్లు భారీగా పెరగనున్నాయి. రూ.1000 టికెట్ పై ఇప్పటివరకు 28 శాతం జీఎస్టీ వర్తించేది. అంటే రూ.1280 లకు టికెట్ లభించేది. ఇకనుండి రూ.1000 టికెట్ పై 40 శాతం జీఎస్టీ పడడంతో టికెట్ ధర రూ.1400 కు చేరుకోనుంది.









