Indian Students In Canada | కెనడాలోని భారత విద్యార్థుల దుర్భర జీవితానికి సంబంధించిన చీకటి కోణాన్ని తాజగా భారత దౌత్యవేత్త సంజీవ్ కుమార్ ( Sanjeev Kumar Verma )వెల్లడించారు. గతకొన్నిరోజులుగా భారత్ కెనడా దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
2022 నుండి ఇటీవల వరకు కెనడా హై కమీషనర్ ( High Commissioner ) గా పనిచేసిన సంజీవ్ తాజగా నెలకొన్న దౌత్య వివాదాల కారణంగా ఇండియాకు తిరగొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా వెళ్లాలని ఆలోచన చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు మరోసారి ఆలోచించుకోవాలని హెచ్చరించారు.
రూ. లక్షలు వెచ్చించినా నాణ్యమైన విద్య దొరక్క ఉద్యోగాలు లభించడం లేదన్నారు. ఉద్యోగాలు లేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తాను కెనడాలో ఉన్న సందర్భంగా ఒకానొక దశలో వారానికి ఇద్దరి విద్యార్థుల మృతదేహాలను భారత్ కు పంపించేవాళ్ళమని, వారు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులే అంటూ సంజీవ్ వెల్లడించారు.
అక్కడ కాలేజీల గురించి పూర్తిగా తెలుసుకున్నాకే పంపాలని సూచించారు. దళారులకు మోసపోయి వారానికి ఒక క్లాసు మాత్రమే జరిగే కాలేజీల్లో విద్యార్థులు చేరుతున్నారని చెప్పారు. దేశంలోని భూములను, ఆస్తుల్ని అమ్మి పిల్లలను కెనడా పంపిస్తే, అక్కడ వారు చిక్కుకుపోయి నరకయాతన అనుభవిస్తున్నారని సంజీవ్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.