Hyd Metro Timings Changed | హైదరాబాద్ మెట్రో రైలు (Hyd Metro Train) ప్రయాణికులకు కీలక అలర్ట్. మెట్రో రైలు ప్రయాణ వేళల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
నవంబర్ 3 నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్ని టెర్మినళ్లలో, అన్ని రోజుల్లోనూ ఈ ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం కోరింది.
ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుంచి 11.45 నిమిషాల వరకు, శనివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా అన్ని రోజుల్లోనూ ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మార్పు చేస్తూ ప్రకటన విడుదల చేసింది మెట్రో యాజమాన్యం.









