- తన తండ్రి దివంగత ఎమ్మెల్యే పీి.పీి రావు
ఆశయ సాధనకు కృషి - బెంగాలీ కులస్తుల హామీలు నెరవేరుస్తా..!
` సిర్పూర్ బీజేపీ నూతన ఎమ్మెల్యే
డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
కాగజ్ నగర్: సిర్పూర్ నియోజకవర్గం ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన మొదటి ఏజెండాని నూతనంగా ఎన్నికైన సిర్పూర్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. సోమవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే, తన తండ్రి పురుషోత్తమరావు ఆశ య సాధనకు కృషి చేస్తానని తెలిపారు. తన గెలుపులో బెంగాలీ కులస్తులు అత్యధిక ఓట్లు వేసి గెలుపుకు దోహదపడ్డారని అన్నారు. వారికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ వరకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం, వారి భూములకు ప్రాజెక్టులు ,చెరువుల ద్వారా సాగునీరు కల్పిస్తానని అన్నారు. అలాగే వారికి పశ్చమ బెంగాల్ రాష్ట్రానికి కాగజ్ నగర్ నుండి ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఎన్నికలకు ముందు మాత్రమే రాజకీయాలు చేస్తామని, ఆ తర్వాత నియోజవర్గంలో అన్ని కులాలు, వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో పోటీలో హేమాహేములైన బిఆర్‌ఎస్ అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప ,బీఎస్పీ తరఫున బరిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ లను పక్కనపెట్టి తనకు విజయనందించిన సిర్పూర్ నియోజక వర్గం ప్రజలకు ఎంత చేసిన తక్కువేనని అన్నారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోనప్ప 2018 లో కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ చలవతోనే ఎన్నికైనట్లు తెలిపారు. ఎన్నికల్లో కోనప్ప కార్యకర్తలను విస్మరించ డం వల్ల ఈసారి చిత్తుగా ఓడిపోయారని అన్నారు. అంతకు ముందు బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకారంతో నియోజవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు కొంగ సత్యనారాయణ, కాళిదాసు మజుందార్ ,ధోని శ్రీశైలం, గోళం వెంకటేష్, ఈర్ల విశ్వేశ్వరరావు, సిందం శ్రీనివాస్, వీరభద్ర చారి, బి ఎం ఎస్ రాష్ట్ర నాయకులు కల్లోల భట్టాచార్య, బికాస్ గారామి తదితరులు పాల్గొన్నారు