Harish Rao News Latest | రాష్ట్రంలోని గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలపై సుమోటోగా కేసు స్వీకరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.
ఈ మేరకు నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని బాలికల గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థతకు గురయిన విద్యార్థినులను హరీష్ రావు ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..బీసీ గురుకుల పాఠశాలలో 111 మంది విద్యార్థులు విషాహారం తిని ఆసుపత్రి పాలైతే కనీసం చీమకుట్టినట్టైనా రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్లో తానే విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇలాంటి సంఘటన జరగడం సిగ్గుచేటన్నారు. అందాల పోటీల్లో రూ.లక్ష ప్లేటు భోజనం..కానీ గురుకులాల్లో మాత్రం కలుషిత ఆహారం పెడుతున్నారని ప్రభుత్వాన్ని హరీష్ నిలదీశారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆసుపత్రులపాలైన ఘటనలు రోజూ జరుగుతున్నాయని మండిపడ్డారు.









