Getup Srinu Suggestions To Movie Reviewers | ప్రస్తుతం సినిమాలకు రివ్యూలు ఇచ్చే కొందరి తీరుపై విమర్శలు గుప్పించారు నటుడు గెటప్ శ్రీను. అలానే రివ్యూలు ఎలా ఉండాలో సూచిస్తూ పలు సూచనలు చేశారు. ప్రస్తుతం కొందరు రివ్యూవర్లు సినిమాను అవహేళన చేస్తున్నారని నటులు, దర్శకులు, సినిమా యూనిట్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాను వివరించేలా రివ్యూలు ఉండాలే తప్ప, కించపరిచేలా ఉండకూడదన్నారు. ఇదే సమయంలో రివ్యూలు ఎలా ఉండాలో పేర్కొంటూ కొన్ని సూచనలు చేశారు. ప్రేక్షకుడు సినిమాను చూడాలా వద్దా అనే ఒక అంచనాకు రావడానికి రివ్యూలు దోహద పడాలి తప్ప సినిమాలోని కీలక మలుపులను, సన్నివేశాలను చెప్పకూడదన్నారు.
వ్యక్తిగత ద్వేషంతో సినిమా రివ్యూ ఉండకూడదని హితవుపలికారు. నటీనటుల, సాంకేతిక నిపుణుల కష్టాన్ని అభినందించేలా ఉండాలని చెప్పారు. సినిమాలోని పాజిటివ్, నెగటివ్ అంశాలను సంయవనంతో విశ్లేషించాలన్నారు. వ్యూస్ కోసం, లైకుల కోసం ఇష్టానుసారంగా థంబనెయిల్స్ పెట్టి వీడియోలు పెట్టకూడదన్నారు. ఒక సినిమా ఫలితాన్ని భట్టి దర్శకుడి భవిష్యత్ ను నిర్ణయించకూడదన్నారు. ఒక సినిమాను రూపొందించడం వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ, ఎంతోమంది కష్టం ఉంటుందనే వాస్తవాన్ని గుర్తించాలని గెటల్ శ్రీను పేర్కొన్నారు.








