Free Gas Cylinders In AP | ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి ( Deepavali ) పండుగ నేపథ్యంలో అక్టోబర్ 31 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత గ్యాస్ సీలిండర్ల పంపిణీ ప్రారంభం కానున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) ప్రకటించారు.
సిలిండర్ ను బుక్ ( Book ) చేసుకున్న 24 నుండి 48 గంటల్లో డెలివరీ ( Delivery ) చేస్తామని ఆయిల్ కంపెనీలు చెప్పినట్లు మంత్రి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో అయితే కేవలం 24 గంటల్లోనే సిలిండర్ ను అందించనున్నట్లు పేర్కొన్నారు.
సిలిండర్ బుక్ చేసుకోగానే ప్రభుత్వానికి సమాచారం అందుతుంది, సిలిండర్ డెలివరీ అయిన క్షణం నుండి 48 గంటల్లో ప్రజల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నుండి తొలివిడుతగా ఆయిల్ కంపెనీ ( Oil Company ) లకు రూ.894 కోట్లు అందిస్తామని, ఈ మేరకు సీఎం చంద్రబాబు ( Cm Chandrababu ) అక్టోబర్ 29న చెక్కును అందించనున్నట్లు మంత్రి తెలిపారు.