Fire Broke Out in Hyd | హైదరాబాద్ (Hyderabad) చందానగర్ లోని అను ఫర్నీచర్ షోరూంలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవలే నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఓ ఫర్నీచర్ షోరూంలో అగ్నిప్రమాదం సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.

ఇప్పుడు అను ఫర్నీచర్ లో కూడా అగ్నిప్రమాదం సంభవించడంతో భద్రతా ప్రమాణాలపై ఆందోళన నెలకొంది. గురువారం అర్ధరాత్రి ఈ షోరూంలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఐదు అంతస్థుల్లో ఉన్న ఫర్నీచర్ పూర్తిగా దగ్ధం అయ్యింది.
అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతుంది. మరోవైపు నేషనల్ హైవే పక్కనే ఉన్న షోరూంలో జరిగిన అగ్నిప్రమాదంతో దట్టమైన పొగ కమ్మేయడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.









