Makkal Needhi Maiam Symbol | సినీ నటుడు కమల్ హాసన్ (Kamal Hassan) కొంతకాలం కిందట రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. తమిళనాడులో ఆయన స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ (Makkal Needhi Maiam) అతిత్వరలో జరగనున్న తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది.
ఈ నేపథ్యంలో మక్కల్ నీధి మయ్యం (MNM) పార్టీకి భారత ఎన్నికల సంఘం ‘బ్యాటరీ టార్చ్ ‘ గుర్తును కేటాయిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ఎన్నికల్లో కూడా ఇదే గుర్తుపై పోటీ చేసిన కమల్ పార్టీ తాజాగా జరగనున్న ఎన్నికల్లోనూ తమ పాత గుర్తునే నిలుపుకొంది.
ఈ మేరకు పార్టీ అభ్యర్థులు పుదుచ్చేరిలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ గుర్తుపై పోటీ చేయనున్నారు. గతంలో తమిళనాడులో కూడా ఈ గుర్తు పైనే పోటీ చేసిన కమల్ హాసన్ పార్టీ, పుదుచ్చేరిలో తన ఉనికిని చాటుకునేందుకు సిద్ధమవుతోంది.
గుర్తు కేటాయింపు పూర్తవ్వడంతో ఇక ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఎన్నికల గుర్తు అనేది ఓటర్లలోకి పార్టీని బలంగా తీసుకెళ్లడానికి దోహదపడుతుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ‘టార్చ్’ గుర్తు ప్రజలకు సులభంగా గుర్తుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






