Donald Trump News | అగ్రరాజ్యం అమెరికా ( America ) ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) మరియు కమలా హ్యారీస్ ( Kamala Harris ) మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఎవరు కైవసం చేసుకొనున్నారో అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
ఈ క్రమంలో ట్రంప్ కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది. అదేంటిదంటే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ట్రంప్ 5 వేల మంది లాయర్ల ( Lawyers )ను నియమించుకున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియ, ఓట్ల లెక్కింపు మరియు ఏవైనా అవకతవకలు జరిగితే నిశితంగా పరిశీలించడం కోసం ట్రంప్ ఐదు వేలమంది లాయర్లను నియమించుకున్నారు.
2020 అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన తరఫు లాయర్లు పలు రాష్ట్రాల కోర్టుల్లో పిటిషన్లు సైతం వేశారు. కానీ సరైన ఆధారాలు లేకపోవడంతో అవి తిరస్కరణకు గురయ్యాయి.
అయితే ఈ సారి మాత్రం ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తే లాయర్లు కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. తన గెలుపు కోసం ట్రంప్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నారని ఆ దేశ మీడియాలో కథనాలు వస్తున్నాయి.