Deputy Cm Pawan Kalyan News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ వర్షాకాల సమావేశాలలో భాగంగా శుక్రవారం ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, వాడకం తగ్గించడంపై ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
రోజువారీ జీవితంలో అవసరమైపోయిన ప్లాస్టిక్ స్థానంలో ప్రత్యామ్నాయంగా పర్యావరణ హితమైన క్లాత్, వెదురు, జ్యూట్ వంటి ఉత్పత్తుల దిశగా ప్రజలు ఆలోచించాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల వలన వాతావరణ కాలుష్యంతో పాటుగా, ప్రమాదకరమైన రోగాలకు దారి తీస్తుందని, పుట్టే పిల్లల్లో కూడా ప్లాస్టిక్ వ్యర్థాల చేరుతున్న ప్రమాద స్థితిని ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకుని ప్లాస్టిక్ నియంత్రణకు బాధ్యత తీసుకోవాలన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛరధం పేరుతో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరిస్తూ, వాటికి బదులుగా నిత్యావసరాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ నియంత్రణ ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.









