TG Municipal Elections | తెలంగాణలో అతి త్వరలో మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు రెండు మూడు రోజుల్లో ఎన్నికల్ షెడ్యూల్ (Municipal Election Schedule) విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revnath Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల నిర్వహణను పటిష్టంగా చేపట్టే లక్ష్యంతో పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా మంత్రులకు ఇన్‌చార్జ్‌లు గా బాధ్యతలు అప్పగించారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ నియామకాలు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఆదిలాబాద్‌కు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్‌కు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్కాజ్‌గిరికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చేవెళ్లకు శ్రీధర్‌బాబు, మెదక్‌కు వివేక్, కరీంనగర్‌కు తుమ్మల నాగేశ్వరరావు, పెద్దపల్లికి జూపల్లి కృష్ణారావు, నల్గొండకు అడ్లూరి లక్ష్మణ్, భువనగిరికి సీతక్క, వరంగల్‌కు పొంగులేటి బాధ్యతలు చేపట్టనున్నారు.
మహబూబ్‌నగర్‌కు పొన్నం ప్రభాకర్‌కు బాధ్యతలు అప్పగించగా, దామోదర రాజనర్సింహాకు కూడా కీలక బాధ్యతలు కేటాయించారు. జహీరాబాద్‌కు అజహరుద్దీన్, నాగర్‌కర్నూల్‌కు వాకిటి శ్రీహరి, ఖమ్మంకు కొండా సురేఖలను ఇన్‌చార్జ్‌లు గా నియమించారు.









