CM Revanth Wishes KCR | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)కు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు.
ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు కేసీఆర్‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు కూడా కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
కేసీఆర్ సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉన్నారని, రాష్ట్రానికి మరింత సేవ చేసే శక్తిని ఆయనకు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ మాజీ సీఎం కే చంద్రశేఖర రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నిండా నూరేళ్లు సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను” అని జగన్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు.










