Centre Announces Rs.11400 Cr Package For Vizag Steel Plant | కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ( Vizag Steel Plant ) కు తీపి కబురు అందించింది.
గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న విశాఖ ఉక్కుకు కేంద్రం రూ.11,400 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ( Ashwini Vaishnaw ) శుక్రవారం అధికారికంగా వెల్లడించారు.
ఈ ప్యాకేజి ద్వారా స్టీల్ ప్లాంట్ ను నడపడం సులభతరామవుతుంది. గురువారం ప్రధాని మోదీ ( Pm Modi ) ఆధ్వర్యంలో జరిగిన ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ( Rammohan Naidu ) హర్షం వ్యక్తం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఊపిరి పోసేలా రివైవల్ ప్యాకేజీ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి మరియు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. నష్టాలను అధిగమించి, ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పాదనతో లాభాల బాట పెట్టేందుకు ఈసాయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల ఎన్డీయే ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని స్పష్టం చేశారు.