Cameron Green Out For Two-Ball Duck A Day After Record-Breaking IPL Deal | ఐపీఎల్ చరిత్రలోనే మూడవ అత్యధిక ధర పలికిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ ఆక్షన్ ముగిసిన గంటల వ్యవధిలోనే డకౌట్ అయ్యారు. మంగళవారం అబుదాబీ వేదికగా జరిగిన ఐపీఎల్ మినీ ఆక్షన్ లో గ్రీన్ అత్యధిక ధర పలికారు. ఇతన్ని రూ.25.20 కోట్లకు కోల్కత్త నైట్ రైడర్స్ దక్కించుకుంది. ఓ విదేశీ ఆటగాడికి ఇంతమొత్తంలో చెల్లించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
అయితే ఇది ముగిసిన గంటల వ్యవధిలోనే గ్రీన్ డకౌట్ అయ్యారు. ఆస్ట్రేలియా లోని అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య యాషెస్ సిరీస్ లో భాగంగా మూడవ టెస్టు బుధవారం మొదలైంది. తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన గ్రీన్ డకౌట్ అయ్యారు. కేవలం రెండు బంతులే ఎదురుకుని పెవిలియన్ బాట పట్టారు. జోఫ్రా ఆర్చర్ వేసిన బౌలింగ్ లో బ్రైడన్ కార్స్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యారు. ఐపీఎల్ ఆక్షన్ నేపథ్యంలో ఇది కాస్తా వైరల్ గా మారింది. ఇకపోతే కోల్కత్త తరఫున ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు గ్రీన్ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు.









