Saturday 10th May 2025
12:07:03 PM
Home > తాజా > పారిశుధ్య కార్మికులతో కలిసి కేటీఆర్ భోజనం!

పారిశుధ్య కార్మికులతో కలిసి కేటీఆర్ భోజనం!

ktr

KTR | బీఆర్ఎస్ (BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఈ ఏడాది నూత‌న సంవ‌త్సర వేడుక‌ల‌ను వినూత్నంగా జరుపుకొన్నారు. నగరంలోని పారిశుద్ధ్య కార్మికుల‌తో ఆయన న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు.

సోమవారం తెలంగాణ భ‌వ‌న్‌ (Telangana Bhavan)లో కేటీఆర్ పారిశుద్ధ్య కార్మికుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. అనంత‌రం పారిశుద్య కార్మికులతో క‌లిసి సహపంక్తి భోజ‌నం చేశారు.

కార్మికుల‌తో సెల్ఫీలు తీసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్ లోనే ప‌లువురు బీఆర్ఎస్ ప్రజా ప్ర‌తినిధులు, నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కేటీఆర్‌ను క‌లిసి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు.

You may also like
ktr
రాహుల్ గాంధీ పేరు అలా పెట్టుకుంటే బాగుంటుంది: కేటీఆర్
Happy New Year 2025
కొత్త ఏడాదికి సరికొత్తగా స్వాగతం పలుకుదాం!
ktr comments
అన్నపూర్ణ నా తెలంగాణలో బువ్వకోసం బిడ్డల ఏడ్పులా: కేటీఆర్
cyberabad police
నూతన సంవత్సర వేడుకలు.. నగరంలో ఆంక్షలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions