Monday 14th April 2025
12:07:03 PM
Home > తాజా > కోమటిరెడ్డి క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్ డిమాండ్!

కోమటిరెడ్డి క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్ డిమాండ్!

ktr

KTR Demands Apology From Komatireddy | తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోమవారం బీబీనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి మరియు జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి ల మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెల్సిందే.

ఈ క్రమంలో స్పందించిన కేటీఆర్..సందీప్ రెడ్డిపై అధికారం, అహంకారంతో కోమటిరెడ్డి జడ్పీ చైర్మన్ వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారన్నారు. అహంకారంతో అడ్డగోలుగా జడ్పీ చైర్మన్ పై దుర్భాషలాడిన మంత్రి కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కోమటిరెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి పైన నోరు పారేసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు.

ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులకు కూడా గౌరవం లేకుండా నియంతృత్వ ధోరణిలో పని చేస్తుందని మండిపడ్డారు. అలాగే జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డికి ఫోన్ చేసి జరిగిన ఘటనపై ఆరా తీశారు కేటీఆర్.

You may also like
‘భూభారతి వెబ్‌సైట్‌..100 ఏళ్ళుపాటు నడిచేలా రూపొందించండి’
ముఖ్యమంత్రిగా ఇదే నా బ్రాండ్: సీఎం రేవంత్
ttd
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త!
dr kavvampally satyanarayana
ఎమ్మెల్యే ఆన్ వీల్స్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions