BJP MP Raghunandan Rao | బీజేపీ సీనియర్ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunadan Rao) శుక్రవారం ఢిల్లీలోని సోనియా గాంధీ (Sonia Gandhi) ఇంటికి వెళ్లారు. బంగ్లాదేశ్‌కు చెందిన బ్లిట్జ్ పత్రిక (Blitz Magazine) రాహుల్ గాంధీ గురించి ప్రచురించిన కథనాలను ఆయన తన వెంట తీసుకెళ్లారు.
అయితే రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోవడంతో బ్లిట్జ్ మ్యాగజైన్ కాపీలను అక్కడి రిసెప్షన్ సిబ్బందికి అప్పగించారు. కాగా, రాహుల్‌కు బేకన్, బీఫ్ అంటే చాలా ఇష్టమని, ఆయన ఆహార, జీవనశైలి పూర్తిగా హిందూమతానికి భిన్నమైనని ఇటీవల బ్లిట్జ్ పత్రిక ఓ కథనం ప్రచురించింది.
రాహుల్ హిందువుగా భావించలేదంటూ ఓ కథనాన్ని వెలువరించింది. రాహుల్ గాంధీకి వివాహమైందని, ఆయనకు పిల్లలు ఉన్నారంటూ కథనంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో కథనంపై సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రఘునందన్ రావు.. నేరుగా రాహుల్ ఇంటికి వెళ్లారు.
రాహుల్ గాంధీకి పెళ్లి అయ్యిందని బ్లిట్జ్ పత్రికలో వచ్చిందని, కాంగ్రెస్ నేతలు హిండెన్‌బర్గ్‌ను నమ్మితే తామూ దీనిని నమ్ముతామని ఆయన వ్యాఖ్యానించారు.
బ్లిట్జ్ పత్రిక ప్రచురించిన ఫోటోలో రాహుల్‌తో ఉన్న అమ్మాయి ఎవరని, రాహుల్ పెళ్లి చేసుకున్నారా..? లివింగ్ టుగెదర్ లో ఉన్నారా? చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.