Barack Obama On Modi | ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అమెరికా పర్యటన అందర్నీ ఆకర్షిచింది. ఈ టూర్ లో భాగంగా మోదీ వివిధ రంగాల్లోని ప్రముఖుల్ని కలుస్తున్నారు. టెస్లా అధిపతి, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలోన్ మస్క్ తో చర్చలు జరిపారు.
మోదీ పిలుపు మేరకు సానుకూలంగా స్పందించిన ఎలోన్ మస్క్ (Elon Musk) రానున్న సంవత్సరం లో తాను భారత్ లో పర్యటిస్తానని చెప్పారు.
అంతే కాకుండా టెస్లా (Tesla) భారత్ లో కూడా తమ వ్యాపారాన్ని ప్రారంభిస్తుందని చెప్పారు. తాను మోదీకి చాలా పెద్ద అభిమానని ఎలోన్ మస్క్ తెలిపారు.
రాబర్ట్ తుర్మాన్ , నెయిల్ టైసన్, నస్సిమ్ నికోలస్, న్యూయార్క్ మేయర్ ఇలా అమెరికా లోని ప్రముఖుల్ని కలుస్తూ వివిధ అంశాల్ని చర్చిస్తూ ముందుకు పోతున్నారు.
గురువారం రోజు అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం శ్వేత సౌధం (WHITE HOUSE) ని సందర్శించారు మోదీ.
అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ (Joe Biden) దంపతుల నుంచి ఘన స్వాగతం అందుకున్నారు. అమెరికా ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ కు 7.5 క్యారెట్ల గ్రీన్ డైమండ్ ని మోదీ బహుమతి గా అందజేశారు.
అనంతరం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ, బైడెన్ లు సుదీర్ఘంగా చర్చించారు. అందులో హెచ్-1బి వీసా లు, రక్షణ రంగం, తీవ్రవాదం తదితర అంశాలు ఉన్నాయి.
అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ అమెరికా-భారత్ స్నేహ సంబంధాల గురుంచి వెల్లడించారు.
ఇది ఇలా ఉండగా మోదీ అమెరికా పర్యటిస్తున్న సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షులు బరక్ ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒబామా వ్యాఖ్యలు
Barack Obama On Modi | అమెరికా నేషనల్ మీడియా సంస్థ CNN కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ బైడెన్ కి ఒక సలహా ఇచ్చారు. భారత దేశంలో మతపరమైన అల్పసంఖ్యకులపై (RELIGIOUS MINORITY) భారత్ లో ఉన్న ముస్లిం ల రక్షణ మరియు వారి పైన జరుగుతున్న దాడి పైన మోదీతో చర్చించాలని సూచించారు.
అంతే కాకుండా ఇలాంటి చర్యలు భారత్ కు మంచిది కాదని, అది దేశాన్ని ముక్కలు చేస్తుందని హితవు పలికారు. కేవలం ఒబామానే కాకుండా బెర్నీ సండేర్స్, డెమోక్రాటిక్ పార్టీ కి చెందిన సభ్యులు ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తారు.
దీంతో ఒబామా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ఒబామా మాజీ అధ్యకుడే కావొచ్చు, అమెరికా బలమైన దేశమే కావొచ్చు కాని ఒక దేశ ప్రధాని తమ దేశంలో పర్యటిస్తున్న సందర్భంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సరైనదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగానే అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో లీడర్లకు తమ దేశంలో జరిగే సమస్యల కంటే పక్క దేశాల పైనే ఆసక్తి ఎక్కువ ఉంటుంది. పొరుగు దేశాలు ఆకలితో అలమటిస్తుంటే అమెరికా మాత్రం ఆయిల్ (OIL) కోసం యుద్ధాలు చేస్తుంది.
అమెరికాలో శ్వేతా జాతి ఆధిపత్యం గురించి పెద్దగా పట్టదు. వారి దేశం లో ఉన్న తీవ్ర అసమానతలని వారు పట్టించుకోరు. కానీ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమిత జోక్యం చేసుకుంటారు.
ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో మైనారిటీ చాలా వరకు సురక్షితంగానే ఉన్నారు. భారత్ లో కొన్ని వర్గాలు మాత్రమే మైనారిటీ లతో విభేదిస్తారు కానీ పాకిస్థాన్ లాంటి దేశంలో దేశం మొత్తం ఐక్యంగా మైనారిటీలపైన దాడి కి దిగుతోంది.
అలాంటి పాకిస్థాన్ పైన ఈ అమెరికా ఎలాంటి విమర్శలు చెయ్యదు. అలాగే ప్రపంచం లో చాలా దేశాలు మైనారిటీలు పట్ల అనుసరిస్తున్న వైఖరిని అమెరికా ఏనాడు కనీసం ఖండించిన దాఖలాలు కూడా లేవు. ఇది అమెరికా ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
అయితే అమెరికా లాంటి దేశాలు మనల్ని మైనార్టీ రక్షణ విషయం లో ప్రశ్నించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అని మనల్ని మనం ప్రశ్నిoచుకోవాల్సిన అవసరం కూడా లేకపోలేదు.