Bangladesh lifts ‘Hilsa’ Ban | పొరుగు బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం కూలి నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యింది. మరోవైపు వెస్ట్ బెంగాల్ లో దేవీ నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాలీ ప్రజలకు బంగ్లాదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
భారత్ కు హిల్సా చేపల ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సుమారు 3వేల టన్నుల హిల్సా చేపలను భారత్ కు ఎగుమతి చేసేందుకు బంగ్లా ప్రభుత్వం అంగీకరించింది. ఏటా జరిగే దుర్గాదేవీ నవరాత్రుల సందర్భంగా బెంగాలీ ప్రజలు తమ ఇళ్లల్లో హిల్సా చేపలను వండుకుంటారు. మరికొంత మంది హిల్సా చేపలతో చేసిన నైవేథ్యాన్ని దుర్గా దేవికి సమర్పిస్తారు.
అయితే బంగ్లాదేశ్ లోని పద్మానదిలో హిల్సా చేపలు అధికంగా లభిస్తాయి. అందుకే వీటిని పద్మాపులస అనికూడా అంటారు. ఏటా దుర్గాపూజ సమయానికి హిల్సా చేపలను బంగ్లా ఎగుమతి చేస్తుంది. ఇందులో భాగంగానే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కూడా దీన్ని కొనసాగనించనుంది. ఇదిలా ఉండగా ప్రపంచంలో లభించే 70 శాతం హిల్సా చెపలు కేవలం బంగ్లాదేశ్ లోనే ఉత్పత్తి అవుతాయి.