- సింగపూర్ లోని స్కూల్ లో అగ్ని ప్రమాదం
- కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన మార్క్ శంకర్
- నేడు సింగపూర్ కు జనసేనాని
Pawan Kalyan Son | ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తనయుడు సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ (Mark Shankar Pawanovich) సింగపూర్ లో చదువుతున్న స్కూల్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.
మంటల్లో చిక్కుకున్న ఆ బాలుడి చేతులు, కాళ్లకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ శంకర్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వెంటనే స్కూల్ సిబ్బంది అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో పవన్ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు.
అయితే ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసి వెళ్తానని పవన్ చెప్పారు. నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తిచేసి వెళ్తానన్నారు. జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ వెళ్లనున్నారు.