Thursday 3rd July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > నీహారిక మరిన్ని విజయాలు అందుకోవాలి: డిప్యూటీ సీఎం పవన్

నీహారిక మరిన్ని విజయాలు అందుకోవాలి: డిప్యూటీ సీఎం పవన్

pawan niharika

Deputy CM Pawan Kalyan | ప్రముఖ నటి, నాగబాబు (Nagababu) తనయ నిహారిక (Niharika Konidela) ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) అభినందించారు. ఏపీలో వరద బాధితుల సహాయార్ధం నిహారిక విరాళం ప్రకటించిన విషయం తెల్సిందే.

ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి ఒక్కొక్క గ్రామానికి 50 వేల రూపాయల చొప్పున 10 గ్రామాలకు రూ. 5 లక్షల విరాళం ప్రకటించిన అన్నయ్య నాగబాబు కుమార్తె, కొణిదెల నిహారికకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.

కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలనే మంచి సంకల్పంతో సాయం చేసేందుకు ముందుకు రావడం సంతోషాన్నిచ్చింది. ఇటీవలే పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే “కమిటీ కుర్రాళ్ళు” తో నిర్మాతగా విజయం సాధించిన నిహారిక మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను ‘ అని పవన్ పేర్కొన్నారు.

You may also like
‘జనసేనను ఆంధ్ర మతసేన గా మార్చారు’
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్మైల్ ప్లీజ్
‘అమ్మ చేతి వంట..పవన్ నిశ్శబ్ద నిరసన’
పవన్ సీఎం అవ్వాలంటే గోవా వెళ్ళాలి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions