Allu Aravind Announce Rs. 2 Crore Aid To Sritej | సంధ్య థియేటర్ ( Sandhya Theater ) తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ క్రమంలో బుధవారం నిర్మాతలు అల్లు అరవింద్ ( Allu Aravind ), దిల్ రాజ్ ( Dil Raju ) శ్రీతేజ్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడుతుందని, త్వరగానే కోలుకుంతున్నాడని తెలిపారు. అనంతరం రేవతి కుటుంబానికి రూ. కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇందులో నటుడు అల్లు అర్జున్ ( Allu Arjun ) రూ. కోటి, దర్శకుడు సుకుమార్ ( Sukumar ) రూ.50 లక్షలు, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుండి రూ.50 లక్షలు ఇలా మొత్తం కలిపి రూ. రెండు కోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రూ. రెండు కోట్ల చెక్కును దిల్ రాజుకు అందించారు.
అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ..గురువారం ఉదయం 10 గంటలకు సినీ పరిశ్రమ పెద్దలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లు స్పష్టం చేశారు.