Aishwaryarai Comments On Social Media | బాలీవుడ్ అందాలతార, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ (Aishwaryarai) తాజాగా సోషల్ మీడియా (Social Media)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం పై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల ఓ బ్యూటీ బ్రాండ్ ప్రచార కార్యక్రమంలో భాగంగా విడుదల చేసిన వీడియోలో, ఆమె వ్యక్తిగతంగా సోషల్ మీడియా ప్రభావంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
“నేను విలువైన వ్యక్తిని. కానీ ఆ విలువను నిర్ణయించేది ఏంటి? నేను పోస్ట్ చేసే ఫోటోలా? వచ్చిన లైకుల సంఖ్యా? లేక కామెంట్లా? ఈ చిన్న విషయాలకు మన ఆత్మగౌరవాన్ని అప్పగించేశాం. మనం మనలా ఉంటేనే అసలైన ప్రపంచం కనిపిస్తుంది.
మన విలువనూ ఎవరూ నిర్ణయించలేరు. మీకు కావాల్సిన ఆత్మగౌరవం కోసం ఇంటర్నెట్ లో కాకుండా నిజ జీవితంలో వెతకండి. సోషల్ మీడియా విషయంలో ఒక మహిళగా, ఒక తల్లిగా నాకు ఆందోళన కలుగుతోంది.
వయసుకు సంబంధం లేకుండా సోషల్ మీడియాకు బానిసలు అవుతూ పక్కవారిని పట్టించుకోవడం మానేశారు. కొందరూ ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. దయచేసి దాని నుంచి బయటపడండి. అసలైన ప్రపంచాన్ని చూసేందుకు ప్రయత్నించండి’ అని చెప్పుకొచ్చారు ఐశ్వర్యరాయ్.









