Sai Pallavi Post On Kubera | అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), ధనుష్ (Danush), రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కుబేర (Kubera). శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలోనే సినిమాపై నటి సాయి పల్లవి ఆసక్తికర పోస్ట్ చేశారు. “కుబేర చాలా ప్రత్యేకమైన సినిమా. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఛాలెంజింగ్ రోల్స్ చేసే ధనుష్ మరోసారి తన యాక్టింగ్ తో ఆడియన్స్ ని అలరించనున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున గారిని ఇలాంటి అద్భుతమైన పాత్రలో చూడటం అభిమానులకు కనువిందు కానుంది.
శేఖర్ కమ్ముల గారు తీసే సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చాలా పవర్ఫుల్ ఉంటాయనే విషయం అందరికీ తెలుసు. అదేవిధంగా ఇందులో రష్మిక పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం బ్లాక్ బస్టర్స్ కొనసాగుతోన్న ఆమెకు ఈ సినిమా మరో విజయాన్ని అందించనుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. మీ కెరీర్లోని బెస్ట్ ఆల్బమ్స్ లో ఇదీ ఒకటి కానుంది.
చైతన్య గారూ, సూరి, అజయ్, స్వరూప్, మొత్తం టీం మీ కష్టానికి తగిన గుర్తింపు, ప్రతిఫలం దక్కుతుంది. నిర్మాత సునీల్ గారు రూపొందిస్తోన్న చిత్రాలు చూసి ఆయన తండ్రి నారాయణ దాస్ గారు ఎంతో సంతోషిస్తుంటారు. స్వచ్ఛమైన హృదయం, అద్భుతమైన టాలెంట్ కలిగిన వ్యక్తి, నాకెంతో ఇష్టమైన దర్శకుడు శేఖర్ కమ్ముల గారు.
తన కథలతో ఆయన ఎంతోమందిలో స్ఫూర్తి నింపారు. అలా, ప్రేరణ పొందిన వారిలో నేనూ ఒకదాన్ని. నా గురువు ఎప్పుడూ సంతోషం, ఆయురారోగ్యాలతో జీవించాలని, ఇలాంటి అద్భుతమైన కథలెన్నో మనకు అందించాలని నేను కోరుకుంటున్నా. నేడు ఈ టీమ్ అందరి ఆనందం కోసం నేను ప్రార్థిస్తున్నా” అని ఆమె రాసుకొచ్చారు.